బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్‌కు ఇప్పుడు ఉన్నంత క్రేజ్ మరేతర హీరోయిన్లకు లేదు. ఆమె డేట్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అలియా భట్ ఇప్పుడు నేరుగా మన తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిందన్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ నటిస్తోన్న విషయం విదితమే. అల్లూరి సీతారామరాజు పక్కన సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది.
అయితే ఈ మేరకు షూటింగ్ కూడా జరిపేశారు. ఆ మధ్య రామ్ చరణ్‌కు కరోనా సోకక ముందు అలియా భట్ ఆర్ఆర్ఆర్ సెట్‌లో అడుగుపెట్టేసింది. అలా అలియా ఎంట్రీ ఇవ్వడం ఇలా రామ్ చరణ్ క్వారంటైన్‌కు పరిమితం కావడం జరిగింది. అయితే అలియా మాత్రం ఆర్ఆర్ఆర్ షూట్‌ను పూర్తి చేసి వెళ్లిపోయింది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. కరోనా వల్ల అలియా మళ్లీ డేట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది.
అయితే ప్రస్తుతం అలియా హిందీ మూవీ సెట్‌లో బిజీగా ఉంది. అలా బిజీగా ఉన్నా కూడా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. నిద్రలో అలియా గురక పెడుతుందా? అని ఓ నెటిజన్ అడిగేశాడు. అయితే దానికి వాళ్ల అమ్మ మాత్రం నో అని సమాధానం చెప్పింది. కానీ ఎప్పుడైనా జలుబు చేస్తే మాత్రం గురక పెడుతుంటాను అని అలియా అసలు విషయం చెప్పింది. మామూలు సమయాల్లో గురక పెట్టనని క్లారిటీ ఇచ్చింది.