మరో రికార్డును బ్రేక్ చేసిన అల వైకుంఠపురములో… సౌత్ లోనే టాప్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే..!

Ala Vaikunthapurramuloo trp ratings create all time industry record

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసును ఊపేసింది.

Ala Vaikunthapurramuloo trp ratings create all time industry record
Ala Vaikunthapurramuloo trp ratings create all time industry record

ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా తిరగరాసింది. అంతేనా.. నాన్ బాహుబలి తెలుగు రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసేసింది. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమానే.

ఎంతైనా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో కదా.. సినిమా అదిరిపోయింది. రిలీజ్ అయినప్పుడే ఇన్ని రికార్డులను బ్రేక్ చేసిన అల వైకుంఠపురములో తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. మరో మైలురాయిని చేరుకున్నది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

అయితే.. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకు కూడా ఏ ఓటీటీలోకి రాలేదు. టీవీలో కూడా రాలేదు. చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇటీవల టీవీలో టెలికాస్ట్ చేశారు.

చాలా గ్యాప్ వచ్చింది కదా.. టీఆర్పీ ఎక్కువ వచ్చే అవకాశం లేదని అంతా భావించారు. కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేసిన ఈ సినిమా ఏకంగా రికార్డు స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకున్నది.

ఇప్పటి వరకు ఉన్న అత్యధిక టీఆర్పీని కూడా తొక్కేసి కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఇప్పటి వరకు సరిలేరు నీకెవ్వరు సినిమా 23.4 టీఆర్పీతో టాప్ లో ఉండగా.. ఆ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసి… ఏకంగా 29.4 టీఆర్పీతో సౌత్ లోనే టాప్ రేటింగ్స్ అందుకున్న సినిమాగా చరిత్రకెక్కింది.

మొత్తం మీద బాక్సాఫీసు వద్ద రికార్డులను క్రియేట్ చేయడమే కాదు.. బుల్లి తెరపై కూడా అనేక రికార్డులను సృష్టించి కొత్త అధ్యాయానికి తెర లేపింది ఈ సినిమా.