టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కన్నప్ప సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌తో, రిచ్ విజువల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా, ప్రభాస్ లుక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించిందని చెప్పాలి. టీజర్ మొత్తంలో ప్రభాస్ ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా శివుడు పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో అగ్రహీరో అయినప్పటికీ, టీజర్ విడుదలైన తర్వాత ఆయన పాత్రకు అంతగా స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర హైలెట్ అవ్వడంతో అక్షయ్ పాత్రను హైలెట్ చేయలేదని గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేకంగా శివుడిగా ఆయన లుక్‌పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లుక్‌లో ఆధ్యాత్మికత కనిపించలేదని కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, అక్షయ్ కుమార్ పాత్ర గురించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆయనే నటించారా లేక మరొకరిని నటింపజేసి CG ద్వారా ఆయన లుక్‌ను యాడ్ చేశారా అనే బిన్నమైన ప్రశ్నలు నెటిజన్లలో వినిపిస్తున్నాయి. గతంలో ఓ మై గాడ్ 2 సినిమాలోనూ ఇలాంటి క్యారెక్టర్ పోషించిన నేపథ్యంలో, ఈ పాత్రకు వేరే మేజర్ హైలైట్ ఉండాలని బాలీవుడ్ అభిమానులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, టీజర్ విడుదలైన తర్వాత ప్రభాస్ పాత్రకు వచ్చిన భారీ రెస్పాన్స్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్‌ను మరుగున పెట్టినట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలయ్యే వరకు నిజమైన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనేది చెప్పలేం. కానీ ప్రస్తుతానికి, టీజర్ ప్రభాస్ ప్రభావం చూపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.