సాధారణంగా కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోవు ఇలా విడుదలకు నోచుకోని ఎన్నో సినిమాలు ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి కోవలోకి చెందినది అక్కినేని నాగేశ్వరరావు జయసుధ నటించిన ప్రతిబింబాలు సినిమా. ఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ప్రతిబింబాలు
చిత్రాన్ని రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ పై నిర్మించారు. 40 సంవత్సరాల తర్వాత నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఈ చిత్రాన్ని మొదటి సారీ విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్నఫలంగా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఈయన రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ కు విరామం ప్రకటించారు. ఇక నాగేశ్వరరావు కోలుకొని సినిమా షూటింగ్లో పాల్గొనాలని భావించగా అప్పటికే జయసుధ ప్రెగ్నెంట్ అవ్వడంతో తాను డెలివరీ అయ్యే వరకు సినిమా షూటింగ్లో పాల్గొన్ననని వెల్లడించారు.ఇక వీరిద్దరూ డేట్స్ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయలేకపోయారు అయితే అక్కినేని చోరవుతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ రీ రికార్డింగ్ దగ్గర మాకు అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కు వెళ్లడంతో ఫైనాన్స్ పరమైన ఇబ్బందులతో ఆగిపోయింది.ఇక ఈ సినిమా విడుదల చేయకుండానే తాను మరణిస్తానేమోనని జాగర్లమూడి రాధాకృష్ణ ఈ సినిమా గురించి ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ సినిమా నవంబర్ 5వ తేదీ ఏకంగా 250 థియేటర్లలో విడుదల కాబోతుందని అన్ని సినిమాలు మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి విజయం అందుకొని మంచి కలెక్షన్లను రాబట్టాలని తాను కోరుకుంటున్నాను అంటూ నిర్మాత రాధాకృష్ణ వెల్లడించారు. ఇలా మొదటిసారి 40 సంవత్సరాల తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందో వేచి చూడాలి.