తాత అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. సత్యం సినిమా సుమంత్‌కు మంచి బ్రేక్ ఇవ్వడంతో ఆ తర్వాత కొన్ని హిట్ చిత్రాలు చేశాడు, మరి కొన్ని ఫ్లాప్‌లుగా మిగిలిపోయాయి. కెరీర్ ఒడిదుడుకులుగా నడుస్తున్న సమయంలోనే అతని నుండి తన భార్య విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సుమంత్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే సుమంత్‌ని ఏఎన్నార్ ఎంతగానో ఇష్టపడతారు. ఇద్దర కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు, మనవళ్లు, మనవరాళ్ళు ఉన్నప్పటికీ సుమంత్ పైనే ఎక్కువ మక్కువ ఎక్కువ. ఈక్రమంలోనే ఆయనని దత్తత కూడా తీసుకున్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు
అప్పట్లో వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నాగేశ్వరరావుకి అందాల రాముడు సినిమా చిత్రీకరణ సమయంలో హార్డ్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన ఏడాది పాటు ఇంటికే పరిమితం అయ్యారు. అదే సమయంలో సుమంత్ జన్మించడం జరిగింది. తాతతోనే ఎక్కువ ఆడుకోవడం, ఏఎన్నార్‌కు కూడా సుమంత్‌తో మంచి కాలక్షేపం కావడం వంటివి జరిగాయి. సినిమాల వలన తండ్రి అనుభూతి పెద్దగా పొందలేని అక్కినేని కనీసం తాత అనుభూతిని అయిన ఆస్వాదించాలని భావించి అమెరికాలో ఉన్న సుమంత్ తల్లిదండ్రులకు దత్తత తీసుకుంటానని చెప్పాడు. ఇందుకు సుమంత్ తల్లిదండ్రులు అంగీకరించడంతో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన భార్య అన్నపూర్ణ సంప్రదాయం ప్రకారం మనవడిని దత్తత తీసుకున్నారు.
సుమంత్ ఎక్కువ కాలం తన తాత, అమ్మమ్మ వద్దే ఉన్నాడు. చిన్నప్పుడు తాతతో కలిసి షూటింగ్‌లకు వెళ్లడం, లొకేషన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేయడం వంటివి చేశాడు. తాతతో ఉన్న చనువో లేదంటే ఆయన నటన అంటే అమితాసక్తో తెలియదు కాని నాగేశ్వరరావుని బాగా ఇమిటేట్ చేస్తాడు. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లో సుమంత్ ఏఎన్నార్ పాత్రలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే