కింగ్ నాగార్జునకి గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లేదు. ఈ మధ్యకాలంలో ఒక్క బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున నుంచి వచ్చిన అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతూనే వచ్చాయి. గత ఏడాది వచ్చిన ది ఘోస్ట్ మూవీ కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. దీంతో ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకొని రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో తన 99వ సినిమాకి ఒకే చెప్పాడు.
మలయాళీ హిట్ మూవీ రీమేక్ గా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందంట. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలలో నటిస్తారని వినికిడి. ఈ ప్రాజెక్ట్ తర్వాత కింగ్ నాగార్జున కెరియర్ లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ పై నాగార్జున ప్రత్యేక దృష్టి పెట్టారంట. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు కథలని విన్నట్లు టాక్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఆ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారంట. అందుకే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఒకటి, అలాగే ఫిక్షనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టొరీతో పాటు, హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ కథలని కింగ్ విన్నారంట.
వీటిలో ఒక కథని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. వందవ సినిమా అంటే కచ్చితంగా ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు. దానికి తగ్గట్లుగానే మంచి పవర్ ఫుల్ సబ్జెక్ట్ తోనే చేయాలని చూస్తున్నారంట. అయితే దర్శకుడిగా మాత్రం మోహన్ రాజాని అనుకుంటున్నారు. అయితే ఈ మూడు కథలలో దేనిని స్టార్ట్ చేయాలనేది కింగ్ ఆలోచిస్తున్నట్లు టాక్.
అలాగే మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. మోహన్ రాజా చెప్పిన ఒక స్టొరీ లైన్ ని నాగార్జున ఫైనల్ చేసేసాడని, దీనిపై ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనా కూడా కింగ్ 100వ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.