అక్కినేని హీరోలు.. మంచి కథలు కావలెను

అక్కినేని హీరోల బ్యాడ్ లక్ ఏమిటో గాని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్స్ పడడం లేదు. ముఖ్యంగా వాళ్ళు యక్క్షన్ వైపు వెళితే ఇటీవల కాలంలో అన్ని కూడా డిజాస్టర్ అవుతున్నాయి. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ముగ్గురు కూడా మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు.

అయితే వరుసగా బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ఎదురవడంతో ఇప్పుడు ముగ్గురు కూడా మంచి కంటెంట్ ఉన్న కథల కోసం, టాలెంటేడ్ దర్శకుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున కూడా కొడుకుల కోసం కొత్త తరహా కథల కోసం వెతుకుతున్నట్టు టాక్ వస్తోంది. ముఖ్యంగా అఖిల్ ఏజెంట్ సినిమా, నాగ చైతన్య కస్టడీ ఇటీవల వెంటవెంటనే రావడం, అవి డిజాస్టర్ కావడం అక్కినేని ఫ్యాన్స్ ను చాలా నిరాశపరిచింది.

అందుకే ముగ్గురు కూడా డిఫరెంట్ స్టోరీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున The Ghost డిజాస్టర్ అనంతరం దర్శకుడిగా పరిచయం అవుతున్న రైటర్ ప్రసన్న కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే భవిష్యత్తు ప్రాజెక్ట్ ల కోసం మరికొన్ని కథలపై చర్చలు జరుపుతున్నారు. ఇక అఖిల్ అయితే యువీ క్రియేషన్స్ లో కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయనున్నాడు. అలాగే మరో ఇద్దరు సక్సెస్ ఫుల్ దర్శకులతో చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ‘దూత’ వెబ్ సీరీస్ రావాల్సి ఉంది. చైతూ కూడా మంచి టాలెంటేడ్ యువ దర్శకులతో వర్క్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.