‘ఏజెంట్’ తడిసి మోపెడైపోయిందహో.!

అక్కినేని అఖిల్ మార్కెట్ ఎంత.? ‘ఏజెంట్’ సినిమా కోసం చేసిన ఖర్చు ఎంత.? అస్సలేమాత్రం పొంతన లేదు.! బ్యాక్ టు బ్యాక్ వరుస ఫ్లాపులిచ్చిన అఖిల్, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కాస్త ఊరట పొందాడంతే.

అలాంటి అఖిల్‌తో ‘ఏజెంట్’ లాంటి భారీ సినిమా ఎలా తీసినట్లు.? సరే, సినిమా తీశారు.. విడుదల చేస్తున్నారు.! బడ్జెట్ దాదాపు 85 కోట్లంటూ నిర్మాత ప్రకటించడమేమిటో.!

అంత ఖర్చు చేశారు బాగానే వుంది, రిటర్నులు సాధ్యమేనా.? అంటే, ‘నో’ ఆన్సర్.! సురేందర్ రెడ్డి సినిమాలంటే, బడ్జెట్ పరంగా ఎక్కువే అవుతాయ్. అది అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి ‘ఏజెంట్’ విడుదలలో ఆలస్యం జరిగింది.

కొన్నాళ్ళ క్రితం.. అంటే, గత ఏడాది ‘ఏజెంట్’ మీదున్న అంచనాలు వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. బజ్ దాదాపు శూన్యం.! లాభాల సంగతి తర్వాత, సగమైనా రికవరీ అయ్యేనా.? అన్న ప్రశ్న సినీ పరిశ్రమలో వినిపిస్తోంది.