శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఒకే ఒక జీవితం” . ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టైం ట్రావెల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ కి జోడి రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా ఒక కీలక పాత్రలో నటించగా… నాజర్ , వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. సెప్టెంబర్ సెప్టెంబర్ 9వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ డల్ గా ఉన్నా కూడా ఆ తర్వాత రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.
ఇక ఈ సినిమాలో అమలా కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే అఖిల్ మాత్రం ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేదు. ఈ విషయంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఈ విషయం గురించి స్పందించాడు.
ఈ క్రమంలో కార్తీక్ మాట్లాడుతూ సినిమా విశేషాల గురించి వెల్లడిస్తూ మాటల మధ్యలో అఖిల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాకపోవడానికి గల కారణం గురించి కూడా బయటపెట్టాడు. ఒకే ఒక జీవితం ప్రీవ్యూ చూసిన అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యి రెండు రోజులపాటు ఆ ఎమోషన్స్ నుండి బయటికి రాలేకపోయాడు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన కూడా అఖిల్ ఎమోషనల్ అవుతానేమో అని భయపడి ఈవెంట్ కి హాజరు కాలేకపోయాడని డైరెక్టర్ శ్రీ కార్తీక్ వెల్లడించాడు.