నాగచైతన్య ఫేవరెట్ ఫుడ్ సీక్రెట్ గురించి బయటపెట్టిన అఖిల్…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసులుగా అడుగుపెట్టిన నాగచైతన్య అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ హీరోలుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందటానికి చాలా కష్టపడుతున్నారు. ఇక నాగార్జున కూడా సినిమాలతో పాటు టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత అమల సినిమాలకు దూరమైనప్పటికీ అప్పుడప్పుడు మాత్రం తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తోంది. ఇక ఇటీవల శర్వానంద్ నటించిన “ఒకే ఒక జీవితం ” సినిమాలో శర్వానంద్ కి తల్లిగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శర్వానంద్, అఖిల్ కలిసి అమల తో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో వారికి ఇష్టమైన ఫుడ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. ఈ మేరకు చై అన్నయ్య కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? అని అమల అడగగా.. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అని అఖిల్ సమధానం చెప్పాడు. అంతే కాకుండా రాత్రి అయితే చాలు చైతన్య ఎలుకలా మారిపోయి ఫ్రిట్జ్ లో ఉన్న స్వీట్స్, ఐస్ క్రీమ్ ని చిన్న చిన్న ముక్కలుగా కొరికి తింటాడు అని చైతన్య సీక్రెట్ గురించి బయట పెట్టాడు.

ఇక శర్వానంద్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగ్గా .. తన తల్లి చేసిన వంటలన్ని ఇష్టంగా తింటానని చెప్పుకొచ్చాడు. ఇక అఖిల్ కూడ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ కి ఇష్టమైన ఆహార పదార్థాల గురించి కూడా వీరు డిస్కస్ చేసుకున్నారు. ఇక అక్కినేని నాగర్జున ఇంట్లో బర్త్ డే , పెళ్ళి రోజు వంటి వేడుకలకు కచ్చితంగా పాయసం చేస్తానని అమల చెప్పుకొచ్చింది.