డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో దద్దరిల్లిన హౌస్! అతనే నెంబర్ 1 పులిహోరా రాజా!

akhil is the no 1 flirter in the biggboss house

బిగ్ బాస్ సీజన్ 4 శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్‌లో ఉండగా.. అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. సొహైల్ చూసి.. ఏంటి ఆమె దగ్గరకు పోతున్నావ్ అని అనడంతో.. హారికను వెనకనుంచి వాటేసుకుని ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది?? అంటూ పులిహోర కలపడం మొదలుపెట్టాడు. అప్పుడు హారిక బాత్ రూంలో ఉంది నువ్ కూడా పెట్టుకో అని నవ్వుతూ అనగా.. ‘బాత్ రూంలో లేదే’ అని అఖిల్ మళ్లీ హారిక వెంట పడ్డాడు. ‘బాత్ రూంలో నీ కళ్లు ఎక్కడ పెట్టుకుని స్నానం చేస్తున్నావో’ అంటూ డబుల్ మీనింగ్‌తో రెచ్చిపోయింది హారిక . కళ్లా… చెప్తే బాగోదు అంటూ అఖిల్ మరింత మసాలా పులిహోర కలిపాడు. తెలుసులే నాకు అంటూ హారిక తెగ సిగ్గు పడిపోయింది. పైన పెట్టుకుని స్నానం చేస్తున్నా అని అఖిల్ అనగా.. హారిక సిగ్గు మొగ్గలౌతూ అఖిల్‌ని మరింత రెచ్చగొట్టింది. దీంతో అఖిల్ బ్యూటిఫుల్ అంటూ పాటలు పాడుతూ ఎదురుగా కూర్చున్ని సొహైల్‌ని పక్కనే ఉన్న మోనాల్‌ని మరింత ఏడిపించే ప్రయత్నం చేస్తూ.. ‘నన్ను కుక్క అనుకున్నా పర్లేదు.. కుక్కకు విశ్వాసం ఉంటుంది..అంటూ హారిక వెంట పడ్డాడు’.

akhil is the no 1 flirter in the biggboss house
akhil is the no 1 flirter in the biggboss house

ఇతనిలో ఈ యాంగిల్ ఈ వారంలోనే చూస్తున్నా అంటూ హారిక చెప్తుంది. ఈ మనిషి మామూలోడు కాదు… అంటూ సొహైల్ అనడంతో… మరి నువ్వూ అని అడిగాడు అఖిల్. వెంటనే హారిక అందుకుని ‘నీవన్నీ డైరెక్ట్ ఎటాక్’ అని అనేసింది. మరి హారిక ఏం చూసిందో ఏమో తెలియదు కానీ… సొహైల్ గురించి చాలానే చెప్పింది. అవును… ఈ పులిహోరలు చేసే రకం కాదు నేను … ముక్కు సూటిగా చెప్తాను … నీలాగ పులిహోర కలపడం తెలియదు’ అంటూ సొహైల్ అఖిల్‌కి కౌంటర్ ఇచ్చాడు.అయితే అఖిల్.. సొహైల్, మోనాల్‌లను ఏడిపించడానికే హారికతో పులిహోర కలిపినా వారిద్దరి మధ్య డబుల్ మీనింగ్ డైలాగ్‌లు మోతాదుని మించిపోయాయి. హారిక కావాలనే అఖిల్‌ని రెచ్చగొట్టడం అఖిల్ రెచ్చిపోవడంతో శుక్రవారం ఎపిసోడ్ గబ్బు లేచిపోయింది.