HomeNewsఅయ్యయ్యో... దేవదాసులాగా మారిపోతాడా ఏంటి ఈ అఖిల్!

అయ్యయ్యో… దేవదాసులాగా మారిపోతాడా ఏంటి ఈ అఖిల్!

బుల్లితెర భారీ పాపులర్ షో బిగ్ బాస్ చివరిదశకు చేరుకుంది. గత సీజన్లతో పోల్చితే మొదట కాస్త తక్కువ ప్రేక్షాదరణ చూరగొన్న ఈ షో ఆ తర్వాత మెల్లగా పుంజుకుంది. హోస్ట్ నాగార్జున ఇచ్చే ఇంట్రెస్టింగ్ టాస్కులు, పార్టిసిపెంట్స్ దూకుడుతో టీఆర్పీ పరంగా ఫర్వాలేదనిపించింది.ఇక చివరికి బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ రేస్‌లో అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక ఉన్నారు. దీంతో అందరూ ఎవరి పెర్ఫార్మన్స్ వాళ్ళు చేస్తున్నారు. అఖిల్ అయితే మోనాల్ వెళ్లిపోవాటాన్ని జీర్ణించుకోలేక కెమెరాల ముందుకు వచ్చి మోనాల్ తలుచుకుని గన్ పెట్టి కాల్చుకుని చచ్చిపోతే బాగుండు అన్నంతగా రియాక్షన్ ఇస్తూ తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ‘నాతో మాట్లాడు.. నాతో మాట్లాడు అని చెప్పే టైప్ కాదునేను.. నా గుండె చాలా భారంగా ఉంది.. ఎక్కువ ఆలోచిస్తున్నాను కదా నేను… ట్రై చేస్తున్నా ఆలోచించకుండా.. అవ్వడం లేదు నా వల్ల తట్టుకోలేకపోతున్నా. అన్నీ లోపల పెట్టుకుంటే బ్రేక్ అవుతాననే భయంతో భయటకు మాట్లాడేస్తున్నా…ఏడుపు రావద్దు…వద్దు… వద్దు చాలా కంట్రోల్ చేసుకుంటున్నా’ అంటూ కెమెరాల ముందు ఓ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు అఖిల్.

Akhil Burst Infront Of Cameras And Open Up About How Much He Missing Monal
akhil burst infront of cameras and open up about how much he missing monal

నిజానికి బాధలో ఉన్న ఎవరైనా మనసులో అనుకుంటారు లేదా బాధ ఉంటే ఎదురు వారితో పంచుకుంటారు. కానీ అఖిల్ మాత్రం చక్కగా కెమెరా ముందు బాగా ఫోకస్ అవుతున్నానా లేదా? అని చూసుకుంటూ… పైకి మాట్లాడుతూ మోనాల్ విషయంలో తెగ బాధపడుతున్నట్టుగా జీవించేశాడు.ఆ తరువాత హారిక దగ్గరకు వెళ్లి.. కొన్నికొన్నిసార్లు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ పర్సన్‌తో మాట్లాడకపోయినా.. ఆ పర్సన్ ఉంటే చాలని అనిపిస్తుంది? అని అనడంతో.. ఇలాంటి విషయాల్లో హైపర్ యాక్టివ్‌గా ఉండే హారిక.. ‘రారా… నువ్ మోనాల్‌ని బాగా మిస్ అవుతున్నావ్ అని అర్థమౌతుంది. చిల్… ఫీల్ హ్యాపీ’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.

నో…నాకు పిచ్చిలేస్తుంది… ఎవర్నైనా కొట్టేయాలనిపిస్తుంది. ఏమౌతుందో అర్థం కావడం లేదు.. నాకు ఎప్పుడూ ఇంతిలా కాలేదు.. అర్థం కావడం లేదు దీనమ్మా..’ అంటూ తెగ బాధపడిపోవడంతో.. హారిక ఏంటి సంగతీ అన్నట్టుగా కళ్లు ఎగరేస్తూ కుచ్ హోగయా అంటూ పాట అందుకుంది. దీంతో అఖిల్ మళ్లీ తను నా ఫ్రెండ్.. మిస్ అవుతున్నానేమో అంటూ మళ్లీ పాతపాటే పాడాడు.ఇక అఖిల్-హారికలు ఇద్దరూ మోనాల్ గురించి ముచ్చట్లు కంటిన్యూ చేస్తూ.. మోనాల్ ఎక్కడకూ వెళ్లదులే.. హైదరాబాద్‌లోనే ఉంటుంది డోన్ట్ వర్రీ అని హారిక చెప్పింది. ఉండమని చెప్పా…ఎక్కడకు వెళ్లొద్దని చెప్పా… అంటూ అమరప్రేమికుడు అఖిల్ మళ్లీ ఓపెన్ అయ్యాడు. చూస్తుంటే దేవదాసులాగా అయ్యేటట్లున్నాడు కుర్రాడు. బిగ్ బాస్ ఎందుకిలా చేసావ్… ఈ ఒక్క వారం ఆ జంటని వేరు చెయ్యకుండా ఉంటే ఏమయ్యేది… ఓహో… ఇన్నాళ్లు ప్రేమ పేరుతో టిఆర్పి సాధించావు, ఇప్పుడు విరహ వేదన నుండి టిఆర్పి పెంచటానికి ప్లాన్ చేసావ్ కదా?

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News