రిస్క్ లేకపోతే లైఫ్‌లో దొరికేది రస్క్ మాత్రమే.. అని ఓ కమర్షియల్ యాడ్‌లో అఖిల్ చెప్పే డైలాగ్‌ని తన కెరీర్‌కి వీలైనంతగా వాడేస్తుంటాడు అక్కినేని అందగాడు అఖిల్. ఇంతవరకూ చేసిన సినిమాలన్నింటికీ అఖిల్ రిస్కే చేశాడని చెప్పొచ్చు. కానీ, ఆ రిస్క్‌లేమీ అఖిల్ కెరీర్‌ని గట్టెక్కించలేకపోయాయ్.
మళ్లీ ఇప్పుడు ఇంకో రిస్క్‌కి శ్రీకారం చుట్టబోతున్నాడట అఖిల్. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు అఖిల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఓ కొత్త బ్యానర్‌లో ఈ సినిమా వుండబోతోందట.
నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత.. ఈ సినిమాకి సహ నిర్మాతగా వుండబోతున్నాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ‘ఏజెంట్’ తరహాలోనే ఈ ప్రాజెక్ట్ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందబోతోందనీ ఇన్ సైడ్ సోర్సెస్ సమాచారం.
‘ఏజెంట్’తో భారీ నష్టాలు చవి చూసిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే రిస్క్ అంటే.. అఖిల్ మామూలోడు కాదు సుమా.!