అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే ఏవీ కూడా ఆశించిన స్థాయిలో జనంలోకి వెళ్ళలేదు.
పాన్ ఇండియా మూవీ అంటున్న కూడా కనీసం తెలుగులో కూడా ఏజెంట్ సినిమాపై బజ్ క్రియేట్ కాలేదు. అయితే ఇప్పుడు సినిమాని ప్రమోట్ చేయడం కోసం అఖిల్ కాస్తా బిన్నమైన మార్గాలు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా విజయవాడలో 172 అడుగులు ఎత్తు ఉన్న బిల్డింగ్ నుంచి రోప్స్ కట్టుకొని అఖిల్ జంప్ చేశారు.
ఇక దానిని చూసే ఆడియన్స్ ని కొత్త ఫీల్ ని అఖిల్ అందించారనే మాట వినిపించింది. ఒక హీరో రియలిస్టిక్ గా ఇలా రోప్స్ పట్టుకొని క్రిందకి దిగడం కాస్తా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అయితే ఈ రకమైన ప్రమోషన్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వినిపిస్తోన్నాయి. అఖిల్ ఆ భవనం నుంచి జంప్ చేసాడని ప్రచారం చేస్తున్నారని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
అది జంపింగ్ కాదని రోప్స్ కట్టుకొని ల్యాండింగ్ కావడం అంటారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా మూవీపై బజ్ ఉంది. మళ్ళీ ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రమోషన్స్ అంటే ఆడియన్స్ కి చిరాకు రావడం తప్ప సినిమాపై ఆసక్తి పెరగదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి సురేందర్ రెడ్డి, అఖిల్ ప్రమోషన్ స్ట్రాటజీలతో మూవీపై ఏ మేరకు బజ్ క్రియేట్ చేస్తారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర అంశంగా మారింది. ఏజెంట్ స్పై థ్రిల్లర్ జోనర్ గా వస్తోన్న సినిమా కావడంతో మౌత్ టాక్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

