మోనాల్ విషయంలో అలా చేసినందుకు బాధపడుతున్నా.. అఖిల్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ నాల్గో సీజన్ గడిచిపోయినా.. ఆ కంటెస్టెంట్లు, ఇంట్లో జరిగిన గొడవలు,వివాదాలు మాత్రం ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. బయటకు వచ్చాక కొందరు కలిసిపోయారు. ఇంకొందరి మధ్య విబేధాలు ఇంకా పెరిగిపోయాయి. దూరం ఇంకా ఎక్కువ అయింది. అయితే నిన్న జరిగిన బిగ్ బాస్ ఉత్సవం మాత్రం అదిరిపోయింది. బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చారు. మళ్లీ నాటి రోజుల్లోకి తీసుకెళ్లారు. బిగ్ బాస్ నాల్గో సీజన్ మొత్తాన్ని ఒకేసారి చూపించేశారు.

Akhil About Monal In Bigg Boss Utsavam
Akhil about Monal In Bigg Boss utsavam

ఇందులో చివర్లో ఓ టాస్క్ ఆడించారు. బిగ్ బాస్ ఇంట్లోని చేదు అనుభవాలు, నాటి మెమోరీస్‌ను కాల్చేసి ఇద్దరి మధ్యలో జరిగిన దాన్ని మరిచిపోవాలని చెప్పుకొచ్చారు. అలా అఖిల్ వంతు వచ్చేసరికి బిగ్ బాస్ ఇంట్లోని ఓ ఘటన గురించి పేర్కొన్నాడు. మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేసిన ఎపిసోడ్, ఆ సంఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. మోనాల్ వెజిటేరియన్ అని తెలిసినా కూడా నాటి నామినేషన్ ప్రాసెస్ ప్రకారం మోనాల్ తలపై అఖిల్ గుడ్డు పగలగొట్టాడు.

అలా చేసి ఉండ కూడదు.. బయటకు వచ్చి చూస్తే.. అలా ఎందుకు చేశానా? అని నాకే అనిపించింది. కానీ అలా చేసినందుకే తరువాత బాగా ఆడింది.. కానీ అలా గుడ్డు కొట్టకుండా ఇంకా ఏదైనా చేసి ఉంటే బాగుండేది.. సారీ మోనాల్ అంటూ అఖిల్ తెగ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ఈ ఇద్దరిని ఇలా బిగ్ బాస్ ఈవెంట్‌లో మళ్లీ వాడేశారు. ఈ ప్రోగ్రాం ఆసాంతం బిగ్ బాస్ నాల్గో సీజన్ విషయాలను మళ్లీ రివైండ్ చేసినట్టుగానే అనిపించింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles