శివుడి అవ‌తారంలో స్టార్ హీరో.. కొట్టి పారేసిన టీం

సినిమాల‌కు సంబంధించి ఇటు సోష‌ల్ మీడియాలో కాని అటు ఫిలిం న‌గ‌ర్‌లో కాని చ‌క్క‌ర్లు కొట్టే వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నిజ‌మెంత ఉందో, అబ‌ద్ద‌మెంత ఉందో తెలుసుకోవ‌డానికి చాలా రోజులు ప‌డుతుంది. ముఖ్యంగా గాసిప్ రాయుళ్ళు సినిమా అనౌన్స్‌మెంట్ వ‌చ్చిందో లేదో వెంట‌నే ఏదో ఒక గాసిప్ పుట్టిస్తారు. కొద్ది రోజులుగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ వార్త అంత‌టా దావానంలా పాకింది. దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం అన్నీ ప్యాన్ ఇండియా చిత్రాల‌ను చేస్తున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ కేటాయించి ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా న‌టించ‌నున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. ఇక మిగ‌తా పాత్ర‌ల‌కు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎవ‌రికి సంబంధించి వారు ప్ర‌చారాలు చేయ‌డం మొద‌లు పెట్టారు.

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా అజయ్ దేవ‌గ‌ణ్ టీం స్పందించింది. ఇలాంటివి త‌ప్పుడు వార్త‌లు ద‌య‌చేసి వాటిని న‌మ్మ‌కండి. న‌న్ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు సంప్ర‌దించ‌లేదు. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలకు బ్రేక్‌ పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ప్ర‌భాస్ 22వ చిత్రంగా రూపొందుతున్న ఆదిపురుష్‌లో సీత పాత్ర కోసం కీర్తి సురేష్ లేదా అనుష్క శెట్టిల‌లో ఒక‌రిని కథానాయిక‌గా ఎంపిక చేసారని టాక్ . హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రూపొంద‌నుంది.