అన్ స్టాపబుల్ 2 పై ఆహా సంచలన వ్యాఖ్యలు.. పైరసీకి పాల్పడితే చర్యలు !

ప్రముఖ ఓటీటి సంస్థ ఆహా సరికొత్త సినిమాలతో పాటు రియాలిటీ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశపు చేస్తుంది. ఈ క్రమంలో ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె సీజన్ 1 లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుని టాప్ టెన్ రియాలిటీ షోస్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించటంతో స్టాపబుల్ సీజన్ 2 కి రంగం సిద్ధం చేసి అక్టోబర్ 14వ తేదీన మొదటి ఎపిసోడ్ ప్రసారం చేశారు.

గతంలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ వన్ అక్రమంగా పైరసీ చేసి పలు వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచారు. ఇలా అన్ స్టాపబుల్ సీజన్ 2 ని అక్రమంగా పైరసీ చేయటానికి వీలు లేకుండా చెక్ పెట్టటానికి ఆహా సంస్థ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆహా సీఈఒ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ .. ఈ ప్రోగ్రామ్‌లో 500 కంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. వారందరి తరపున సే నో టు పైరసీ (పైరసీ చేయకండి) అంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ను ఎవరైనా పైరసీ చేసినట్లు గమనించినట్లయితే ఆ పైరసీకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను యాంటీ పైరసీ హెల్ప్ లైన్ నెంబర్ 93939 50505 లేదా apc50505@gmail.com లకు వివరాలను తెలియజేయాలని కోరారు.

ఇలా అక్రమంగా పైరసీకి పాల్పడుతున్న వ్యక్తులు లేదా సంస్థలపై ఆహా సంస్ధ చట్ట పరమైన సివిల్‌, క్రిమినల్ చర్యలను తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 2 లో బాలకృష్ణ తన వియ్యంకుడిని, అల్లుడిని మొదటి ఎపిసోడ్ లో గెస్ట్ గా ఆహ్వానించారు. దీంతో షో ప్రారంభించిన మొదటి ఎపిసోడ్ తోనే లక్షల సంఖ్యలో సాధించింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మధ్య వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయపరమైన విషయాల గురించి చర్చ జరిగింది.