ఓరి దేవుడా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా..?

దీపావళి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేమకథాచిత్రం” ఓరి దేవుడా”ఈ మూవీలో విశ్వక్‌ సేన్‌ హీరోగా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం విశేషం. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీలో మిథిలా పాల్కర్, ఆశా భట్‌ హీరోయిన్లుగా నటించారు.ఓరి దేవుడా’గా రీమేక్‌ చేయడం జరిగింది

శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రొమాంటిక్ ప్రేమ కథ ఓరి దేవుడా మూవీ ప్రేక్షక ఆదరణ పొందుతూ థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. ఈ మూవీని తమిళంలో ఘన విజయం సాధించిన”ఓ మై కడవులే ” అనే సినిమాను తెలుగులో “ఓరి దేవుడా” పేరుతో డబ్బింగ్ చేయడం జరిగింది. అశ్వత్‌ మారిముత్తు ఓరి దేవుడా సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెరాకెక్కించడంతో బాలీవుడ్ లో కూడా మంచి స్పందన లభిస్తుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఎంతో ప్రేక్షకాదరణ పొందుతున్న ఓరి దేవుడా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శక,నిర్మాతలు కానీ ఆహా యాజమాన్యం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఓరి దేవుడా సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ సహజనటన అందర్నీ ఆకర్షిస్తుంది. అలాగే ఇందులో రాహుల్ రామకృష్ణ ఆశాభట్ కూడా ప్రత్యేక పాత్రలో నటించారు.చిత్రానికి లియోన్ జేమ్స్ అందించిన అద్భుతమైన సంగీతం అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తోంది.వంశీ కాక ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. పీవీపీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.