ఏజెంట్.. ఆఖరి నిమిషంలో మరో ప్లాన్

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఏజెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, మలయాళీ భాషలలో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అఖిల్ గట్టిగానే కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా కాస్తా డిఫరెంట్ గా ప్రయత్నం చేస్తున్నాడు.

ఏకంగా రోప్ ల్యాండింగ్ చేస్తూ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాను సినిమాలో ఎలాంటి సాహసాలు చేసింది చూపించేందుకు డైరెక్ట్ గానే సాహస విన్యాసాలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వైపు సురేందర్ రెడ్డి కూడా సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి గట్టిగా ట్రై చేస్తున్నట్లు టాక్. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.

దీంతో హై ఎనర్జిటిక్ మాస్ సాంగ్ ని ఇప్పుడు ఏజెంట్ కోసం సురేందర్ రెడ్డి రెడీ చేయిస్తున్నారు. ధమాకాతో సూపర్ సక్సెస్ అందుకున్న భీమ్స్ సారధ్యంలో ఒక ఊరమాస్ బీట్ ని రెడీ చేయించి తెరకెక్కిస్తున్నారంట. ఈ సాంగ్ కి వేగంగా ఫినిష్ చేసి ఏజెంట్ రిలీజ్ కి ముందు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ కి ఇంకా పది రోజులే సమయం ఉంది.

సినిమాపై పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలన్నా, మంచి ఓపెనింగ్స్ కావాలన్నా ఫస్ట్ డే ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా రావాలి. దీనికోసం రకరకాల ప్రమోషన్స్ జిమ్మిక్కులతో సురెందర్ రెడ్డి జనాల్లోకి ఏజెంట్ ని పంపిస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనేది వేచి చూడాలి.

మరో వైపు అఖిల్ ఏపీలోని అన్ని మేజర్ సిటీలలో తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇలా అవ్వడం వలన వేగంగా రిజిస్టర్ అయ్యి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా ఏజెంట్ టీమ్ మొత్తం ఇప్పుడు మూవీకి హైప్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.