ఇప్పుడు టాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర కూడా ఓ రేంజ్ లో అయితే హైప్ లో ఉన్న బిగెస్ట్ ప్రాజెక్ట్ లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి.
పార్ట్ 1 అనూహ్యమైన రెస్పాన్స్ అందుకోవడంతో పార్ట్ 2 పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మెయిన్ గా అప్పటువరకు అల్లు అర్జున్ కి అంతగా మార్కెట్ లేని ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పుష్ప 2 కి డిమాండ్ వేరే లెవెల్లో నెలకొంది. దీనితో ఈ క్రేజ్ ని మేకర్స్ వాడుకునే పనిలో పడ్డారు.
అయితే ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో వారు అన్నిటికి కలిపి ఏకంగా 100 కోట్లు మేర కోట్ చేయగా అది వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు మరోసరి పుష్ప ఓవర్సీస్ డీల్ కోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి మేకర్స్ ఓ మూడు కోట్లు తగ్గించి 97 కోట్లకి అయితే డీల్ ని కంప్లీట్ చేసారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఇది అఫీషియల్ కాదు కానీ ఒకవేళ కానీ నిజం అయితే మాత్రం ఇదే ఇండియన్ సినిమా నుంచి టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ డీల్ అవుతుంది అని చెప్పాలి. లాస్ట్ గా అయితే ప్రభాస్ నటించిన చిత్రాలు సలార్ మరియు బాహుబలి 2 చిత్రాలు 70 కోట్లకి పైగా డీల్స్ తో ఉన్నాయి. మరి పుష్ప విషయంలో ఇది నిజమో కాదో చూడాలి.