యూఎస్ లో ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసేసారా?

ఇప్పుడు భారతీయ సినిమా అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రైడ్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి అకాడమీ అవార్డ్స్ కి ఎంపిక అయ్యిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుపొంది రావడం కోసమే అని చెప్పాలి.

అయితే ఈ సినిమా యూనిట్ అంతా ఇప్పుడు యూఎస్ లోనే ఉన్నారు. మొదటగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి అక్కడ మీడియా ల నుంచి పిలుపు రాగా తాను వెళ్లి ఎన్నో ఇంటర్వ్యూలు ఇప్పటికీ అనేక ప్రోగ్రాం లలో తాను పాల్గొంటున్నాడు. అయితే అప్పటి వరకు చరణ్ పేరే ఎక్కువ వినిపించి తారక్ పేరు తక్కువే వినిపించింది.

అయితే అప్పుడు ఎన్టీఆర్ అక్కడ లేదు కాబట్టి అనుకోవచ్చు కానీ ఎన్టీఆర్ ఇప్పుడు అక్కడకి వెళ్లి మూడు రోజులు అయ్యింది. కానీ తాను ఎక్కడా మీడియాలో కనిపించింది లేదు. చరణ్ లా ఎలాంటి పాడ్ కాస్ట్ కానీ కనీసం తనతో కలిసి కూడా ఇంకా కనిపించలేదు. దీనితో మళ్ళీ తారక్ ని పక్కన పెట్టారా ఏంటి అని అనుమానం కలుగుతుంది.

చరణ్ ఇలా వెళ్ళగానే అలా సాలిడ్ వెల్కమ్ అందుకొని మీడియాలోకి వెళ్ళిపోయాడు. కానీ తారక్ విషయంలో అలా లేదు. దీనితో తనకి అక్కడి మీడియా నుంచి పిలుపు రాలేదా లేక తనకి ఆసక్తి లేదా లేక వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలియాలి. మరి వీకెండ్ లో ఏమన్నా గట్టిగా ప్లాన్ చేసారో ఏమో కూడా చూడాలి.