లేడీ కమల్ హాసన్ అనసూయ..నెటిజన్స్ మండిపాటు 

తెలుగు స్మాల్ స్క్రీన్ పుణ్యమా అని చాలా మందే బిగ్ స్క్రీన్ పై అయితే సక్సెస్ అయ్యారు. మరి అలా బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యి సిల్వర్ స్క్రీన్ కి చేరుకున్న ఫీమేల్ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ కోసం తెలుగు ఆడియెన్స్ కి చెప్పక్కర్లేదు. అయితే ఆమె స్మాల్ స్క్రీన్ పై ఎంతగానో అలరించింది.

అలాగే బిగ్ స్క్రీన్ పై కూడా మంచి చిత్రాలు ఎంపిక చేస్తూ వెళ్తుంది. కానీ ఆమె విషయంలో మాత్రం నెటిజన్స్ కి మామూలు కోపం ఇప్పుడు లేదు. సోషల్ మీడియాలో మెయిన్ గా ట్విట్టర్ లో ఇప్పటివరకు ఏదొక కాంట్రవర్సీ తోనే పబ్బం గడుపుతూ వచ్చిన అనసూయ ఆఫ్టర్ గ్యాప్ మళ్లీ కాంట్రవర్సీ తీసుకొచ్చింది.

అయితే నిన్ననే ఆమె మొదట ఇన్స్టాగ్రామ్ లో తాను ఏకంగా ఏడ్చేస్తూ తనపై సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తున్నారు అని స్టార్ట్ చేసింది. దీనితో ఒక్కసారిగా ఆమెపై ఎక్కడ లేని సాఫ్ట్ కార్నర్ అయితే వచ్చేసింది. కానీ అది జరిగి ఎంతో సమయం కూడా అవ్వకుండా హ్యాపీగా నవ్వేస్తూ అవేవి నేను పట్టించుకొను వాటి నుంచి బయటికి వచ్చేసాను అంటూ మరో షేడ్ చూపించింది.

దీనితో ఈ కొత్త వీడియోలు చూసి అప్పటివరకు సింపతీ చూపిన వారు అంతా అవాక్కయ్యారు. లేడీ కమల్ హాసన్ అంటూ మండిపడుతూ ఇలాంటి అటెన్షన్ కోసం ఇంత దిగజారడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దీనితో సినీ ట్రాకర్స్ కూడా అనసూయ అటెన్షన్ పనులకి దణ్ణం పెడుతున్నారు. మరి అనసూయ వ్యవహారం ఏంటో ఏందో ఎవరికీ అర్ధం కావట్లేదు.