Roja: ఇంకెన్ని రోజులు టీవీలో కనిపిస్తుందో..?

Roja: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో మొదలై ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు కావస్తోంది. జబర్దస్త్ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు రోజా ఆ షో కి జడ్జిగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సినిమాలకు దూరంగా ఉన్న రోజా జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయింది. రోజా ఎంఎల్ఏ గా రెండు సార్లు గెలిచినప్పటికీ జబర్దస్త్ ని వీడలేదు. కానీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోజాకి మంత్రి పదవి దక్క టంతో తన సమయాన్నంతా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని భావించి జబర్దస్త్ కార్యక్రమానికి అధికారికంగా స్వస్తి చెప్పింది.

మల్లెమాల వారు ఇటీవల రోజాకి మంత్రి పదవి దక్కినందుకు జబర్దస్త్ కంటెస్టెంట్ లందరూ కలిసి సన్మానం చేశారు. రోజా ఇక జబర్దస్త్ లో కనిపించదు అని అనుకున్న వారందరూ షాక్ అయ్యే లాగ రోజా మరి ఈ టీవీ లో కనిపించింది. అదేంటీ జబర్దస్త్ కి స్వస్తి చెప్పిన రోజా మరి కనిపిస్తుంది.. మంత్రి పదవి వచ్చిన కూడా జబర్దస్త్ మీద ఉన్న ఇష్టం తో మళ్లీ జడ్జ్ గా వస్తుందా ఏంటి? అని అందరూ అనుమాన పడ్డారు. కానీ మంత్రి పదవి రావటానికి ముందు షూట్ చేసిన ఎపిసోడ్ లు ఇప్పుడు వేస్తున్నారు అని క్లారిటీ వచ్చింది.

అయితే రోజా ఇంకా ఎన్నిరోజులు ఇలా జబర్దస్త్ లో కనిపించనుందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం ఒక్కసారి కాబోతున్న ఎపిసోడ్ ఆమెకు మధ్య వచ్చిన తర్వాత షూట్ చేసినది. అందువల్ల రోజా వచ్చే వారం ఎపిసోడ్ లో మాత్రమే మనకి జడ్జ్ గా కనిపించనున్నారు.రోజా జబర్దస్త్ నుండి వెళ్ళిపోతే ఆమె స్థానం ఎవరూ భర్తీ చేస్తారు అన్న విషయాల గురించి కూడా పూర్తి సమాచారం అందలేదు. ఈ విషయం గురించి తెలియాలంటే మరి ఒక వారం వేచి చూడాల్సిందే.