ప్రభాస్ అన్నా నిన్ను ఇలా చూసి పదేళ్లు అయ్యింది .. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్…!

ప్రభాస్ – టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టొరీ ‘రాధే శ్యామ్’. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మాణం లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్న రాధే శ్యామ్ జులై 30న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1960 కాలం నాటి వింటేజ్ లవ్ స్టోరీగా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ లో అధికారకంగానూ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇక రాధే శ్యామ్ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు రాధకృష్ణ. కాగా రీసెంట్ గా రిలీజైన గ్లిమ్స్ లో ‘రోమియో ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు’ అని చెప్తూ ఈ సినిమా ఫుల్ లెన్త్ లవ్ ఎంటర్టైనర్ అని తెలిపారు. అయితే ప్రభాస్ దాదాపు పదేళ్ళ క్రితం ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నటించాడు. అంతక ముందు వర్షం, యోగి, మున్నా, బిల్లా, రెబల్ లాంటి మాస్ చిత్రాల్లో నటించిన ప్రభాస్.. తనలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలతో నిరూపించాడు.

అయితే ఈ సినిమాల తర్వాత మళ్ళీ ప్రభాస్ మాస్ సినిమాలనే చేసి హిట్ కొట్టాడు. మిర్చి, బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. ఇక ఈ పదేళ్లలో మళ్ళీ రొమాంటిక్ సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా ‘రాధే శ్యామ్’ అన్న కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్ నుంచి రొమాంటిక్ సినిమాలు కావాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ ‘రాధే శ్యామ్’ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే ‘రాధే శ్యామ్’ టీజర్ ని కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడి అవుతున్నారని తెలుస్తోంది. మరి పదేళ్ళ తర్వాత లవ్ స్టోరీతో వస్తున్న ప్రభాస్ కి ‘రాధే శ్యామ్’ ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో చూడాలి.