నాలుగు నెలల తర్వాత ఓటీటీ లో దర్శనమిచ్చిన తంగలాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా తంగలాన్ ఆగస్టు 15న ఈ సినిమా విడుదలై కథా పరంగాను, కమర్షియల్ గాను పర్వాలేదు అనిపించుకుంది. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో విక్రం మరొకసారి విభిన్నంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు తంగలాన్ చిత్రం వరల్డ్ వైడ్గా దాదాపు 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

దాదాపు 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా ఫుల్ రాంగ్ లో 110 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు టాక్. అయితే ఈ సినిమా అనూహ్యంగా డిసెంబర్ 10 మంగళవారం నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ భాషల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమాని ఏకంగా 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి.

ఇన్నాళ్లు కోర్టు కేసులు, ఓటీటీ తో నిర్మాత సంస్థకు ఉన్న విభేదాలు కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇందులో కొన్ని మతాలను కించపరిచారని మద్రాస్ కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే, దీంతో ఎప్పుడో రావాల్సిన తంగలాన్ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కోర్టు మూవీ మేకర్స్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

దీంతో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూడవచ్చు. ఈ చిత్రంలో బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రానికి మూవీ మేకర్ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే మొదటి సినిమా రిజల్ట్స్ చూసిన మూవీ మేకర్స్ పార్ట్ టూ పై దృష్టి పెడతారో లేదో అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు సినీ పరిశ్రమ వారు.