బాలయ్య తర్వాత మెగాస్టార్ సినిమాలోకి వచ్చేసిన యంగ్ హీరోయిన్.!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో శృతి హాసన్ కూడా ఒకరు. మరి గత ఏడాది మాస్ మహారాజ రవితేజ తో “క్రాక్”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “వకీల్ సాబ్” సినిమాలతో అదిరే హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరోయిన్ నెక్స్ట్ పలు భారీ ఆఫర్స్ నే తన పాకెట్ లో వేసుకుంది.

మరి ఇప్పుడు అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో  డ్రామా సలార్, నెక్స్ట్ బాలయ్య తో తన కెరీర్ లో 107 వ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా మరో పక్క మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 154వ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ ఒకో సినిమా కంప్లీట్ చేస్తూ వెళ్తుంది. గత కొన్ని వారాల కితమే బాలయ్య సినిమా సెట్స్ లో సందడి చేసి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో హాజరు అవువుతున్నట్టుగా తెలుస్తుంది.

దర్శకుడు బాబీ తో మెగాస్టార్ చేస్తున్న ఈ సినిమా లో ఈరోజు నుంచే ఈమె హాజరు అవుతున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా చిరుతో కూడా సీన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ యంగ్ బ్యూటీ ఫుల్ బిజీ బిజీగా ఉంది.