క్రేజీ అప్డేట్ : 16ఏళ్ల తర్వాత ప్రభాస్, నయనతార ఏ సినిమాలో అంటే?

ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా అలాగే సౌత్ లో కూడా భారీ స్టార్డం ఉన్న అనేకమంది స్టార్ హీరో అండ్ హీరోయిన్స్ లో ఒకప్పుడు యంగ్ హీరో హీరోయిన్స్ గా నటించిన ప్రభాస్ మరియు నయనతార లు కూడా ఒకరు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయితే కోలీవుడ్ సినిమాని నయనతార ఇప్పుడు ఏలుతుంది.

అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అప్పట్లో చిత్రం “యోగి” మిస్ ఫైర్ అయ్యింది కానీ ఇప్పటికీ దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. కాగా అప్పటి నుంచి అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ పడలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ క్రేజీ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. ఈ ఇద్దరి జంట మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతుందట.

ఐతే ఇది ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో కాదు అని గెస్ట్ పాత్రలో ఇద్దరు జంటగా కనిపిస్తారట. ఇంతకీ ఆ సినిమా ఏదంటే మంచు వారి హీరో భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమా “భక్త కన్నప్ప” లో అట. ఆల్రెడీ ప్రభాస్ పేరు లాక్ కాగా ఇప్పుడు తనకి జంటగా నయనతార ని మేకర్స్ ఆల్రెడీ లాక్ చేశారట.

ఈ విషయాన్ని స్వయంగా సినిమాలో నటిస్తున్న వారే రివీల్ చేశారు. దీనితో మళ్ళీ ఈ క్రేజీ పెయిర్ దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది అని చెప్పాలి. మరి ఇలాంటి ఎగ్జైటింగ్ వార్తలు కోసం తెలుగు రాజ్యం ని ట్యూన్ చేస్తూ ఉండండి.