యంగ్ టాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపధ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని పంచుకున్నారు. చిత్రకథ చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. అసలు ఇలాంటి కథ ఎలా ఆలోచించగలిగారో అనిపించింది. ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. చేయగలనా? లేదా? అని ఆలోచించుకోవడానికి కొంత సమయం అడిగాను. తర్వాత ఆనంద్ కంప్లీట్ నేరేషన్ ఇచ్చారు.
అది విగానే చాలా ఆనందంగా అనిపించింది. చేయగలననే నమ్మకం కుదిరింది. ఇందులో భూమి అనే పాత్రలో కనిపిస్తాను. భూమి ట్రైబల్ గర్ల్. తన ఊర్లో తనొక్కరే చదువుకున్న అమ్మాయి. చూడటానికి అందంగా అమాయకంగా కనిపిస్తుంది. తప్పుని నిలదీసే ధైర్యం వున్న అమ్మాయి. ఆ పాత్ర బలం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అర్ధమౌతుంది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మేలోడీస్ చిత్రాల్లో గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రల్లో కనిపించాను. ఇందులో మాత్రం గర్ల్ నెక్ట్స్ ఫారెస్ట్ పాత్ర అనాలి.
ట్రైలర్ లో చూస్తే నాకు ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. భూమి పాత్రలో చాలా పవర్ వుంది. నేను హిల్ స్టేషన్(కూర్గ్) నుంచి వచ్చాను. ప్రకృతి జీవితంలో ఒక భాగం. నిజ జీవితంలో కూడా మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులని ఆరాధిస్తాం. ఆ రకంగా భూమి పాత్ర నేను రిలేట్ చేసుకునే విధంగా వుందని వివరించారు.