ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి సిద్ధం అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. బహుశా భారీ నెగిటివ్ నుంచి మంచి పాజిటివ్ లోకి వచ్చిన సినిమా కూడా ఈ మధ్యలో ఇదే కావచ్చు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీతా దేవిగా నటించగా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండగా దీని తాలూకా థియేట్రికల్ ట్రైలర్ కోసం అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా..
అనుకున్నట్టుగానే మొదట థియేటర్లు లో రిలీజ్ చేసి నెక్స్ట్ అయితే యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఇక ఈ ట్రైలర్ మొదటగా ఈ మే 8న థియేటర్స్ లో రిలీజ్ కి వస్తుండగా ఆ రోజు అయితే ఈ సినిమా ఏ టైం లో రానుందో ఇప్పుడు తెలుస్తుంది.
కాగా స్ట్రాంగ్ బజ్ ప్రకారం ఈ ట్రైలర్ ని మేకర్స్ 8న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా దీనిపై ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. అంతే కాకుండా ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తారు అనేది కూడా లిస్ట్ ఇస్తారట. ఇక ఈ ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో 2డి, 3డి రెండు వెర్షన్స్ లో రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ భారీ సినిమా అయితే ఈ జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
