ట్రైలర్ టాక్ : హాలీవుడ్ అద్భుతంలా “ఆదిపురుష్”.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మొదటి పౌరాణిక భారీ చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని నెగిటివిటీ నుంచి స్టార్ట్ అయ్యి ఇపుడు ఇండియన్ సినిమా అంతా కూడా ఓ రేంజ్ లో రామనామ జపం చేసేలా తీసుకొచ్చారు.

ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం పైగా మొదట థియేటర్స్ లో అని కానీ అంతకు ముందే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం మరింత క్రేజీ హైప్ ని తీసుకొచ్చింది. కాగా ఈ భారీ సినిమా ట్రైలర్ అయితే ఇప్పుడు వచ్చేసింది.

ఇక ఈ అవైటింగ్ ట్రైలర్ అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో. ఈ సినిమా ట్రైలర్ అన్ని అంచనాలు అందుకునేలా ఉందని చెప్పాలి.

అయితే ఈ ట్రైలర్ లో బాగా చూస్తే హాలీవుడ్ చిత్రం “ది జుంగుల్ బుక్” లో ఎంత నాచురల్ విజువల్స్ ని మనం చూసామో ఈ ట్రైలర్ లో కూడా కనిపించడం అనేది ఇండియన్ సినిమా నుంచి బెస్ట్ అవుట్ పుట్ లో ఒకటి అని చెప్పొచ్చు. ఈ తరహా విజువల్స్ అయితే చాలా తక్కువ సినిమాల్లోనే మనం చూసాం.

కాగా ప్రభాస్ సహా కృతి ఇతర వానర సైన్యంలో విజువల్స్ డైలాగ్స్ అన్నీ కూడా ఎంతో గ్రాండియర్ గా కనిపిస్తూ బ్లాకింగ్ గా ఉన్నాయి. మొత్తానికి అయితే ఇన్నాళ్లు సమయం తీసుకున్నప్పటికీ జస్ట్ కొన్ని ఫ్రేమ్స్ లో మినహా అదిరే లెవెల్లో ఈ ట్రైలర్ ఉందని చెప్పాలి. విజువల్స్, డైలాగ్స్, ఓంరౌత్ డైరెక్షన్ అన్నీ కూడా సెన్సేషనల్ గా ఉన్నాయి. ఇక రిలీజ్ అయ్యాక సినిమా ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాల్సిందే. 
Adipurush (Official Trailer) Telugu Prabhas | Kriti Sanon | Saif Ali Khan | Om Raut | Bhushan Kumar