షాకింగ్ : “ఆదిపురుష్” ఈ ఫార్మాట్ రిలీజ్ నిలిపివేత.!

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో భారీ రిలీజ్ తో రాబోతున్న ఏకైక సినిమా “ఆదిపురుష్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా హీరోయిన్ కృతి సనన్ సీతగా దర్శకుడు ఓంరౌత్ ఐతే తెరకెక్కించిన ఈ సినిమా ఇంకో వారం రోజుల్లో అయితే థియేటర్స్ లో పడిపోనుంది.

మరి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే 3డి రిలీజ్ ఉంటుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. పైగా వరల్డ్ వైడ్ అయితే 3డి తో పాటుగా ఐమ్యాక్స్ 3డి లో కూడా రిలీజ్ చేస్తున్నామని ఆ పనులు కూడా బయటకు వెళ్లి మరీ ఓంరౌత్ చేసాడు. కానీ ఇపుడు సీన్ కట్ చేస్తే అసలు ఆదిపురుష్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఐమ్యాక్స్ రిలీజ్ అయితే ఆగిపోయిందట.

ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో 3డి మరియు 4డి ఫార్మట్స్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ క్రేజీ ఫార్మాట్ విషయంలో ఇప్పుడు ఎందుకు వెనక్కి వచ్చేసారో మరి తెలియాల్సి ఉంది.

బహుశా ఈ వెర్షన్ స్క్రీనింగ్ కి అయితే సినిమా విజువల్స్ ఎక్స్ పీరియన్స్ బాగోకపోయి ఉండొచ్చు. ఇది మాత్రం ఈ సినిమా ఐమ్యాక్స్ వ్యూవర్స్ కి కాస్త డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి అజయ్ అతుల్ లు సంగీతం అందించగా ఈ జూన్ 16న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.