వైరల్ : “ఆదిపురుష్” పై క్రేజీ డీటెయిల్స్ ఇచ్చిన టెక్నీషియన్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. మరి ఈ భారీ సినిమాని బాలీవుడ్ దర్శకుడే ఓంరౌత్ తెరకెక్కిస్తుండగా సినిమా షూటింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది.

మరి సినిమా పోస్టర్ టీజర్ లు రాకముందు వరకు కూడా భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఒక్కసారి సినిమా టీజర్ వచ్చాక అయితే సినిమాపై అంతా రివర్స్ అయిపొయింది. మరి ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ చాలా పూర్ గా ఉండడం సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివిటి తీసుకొచ్చింది.

అయితే ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ పళని తమిళ టెలివిజన్ మీడియాలో ఇచ్చిన తన లేటెస్ట్ చిత్రం “వారిసు” సక్సెస్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తిగా మారాయి. మరి ఈ సినిమాలో తాము కేవలం నటులపై షూట్ మాత్రమే చేశామని ఇక మిగతా అంతా బ్లూ స్క్రీన్ లోనే చేశామని అంటే సినిమాలో కనిపించే ప్రతి ఇతర విజువల్స్ ని కొత్తగా సృష్టించిందే అని చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా సినిమా టీజర్ వచ్చాక ట్రోల్స్ పై కూడా మాట్లాడుతూ ఈ ట్రోల్స్ లో చెప్పకున్న విజువల్స్ ని ఇప్పుడు మరింత బాగా ఇంప్రూవ్ చేశామని ఈ వర్క్ కూడా కంప్లీట్ కాగా ఇది డెఫినెట్ గా మరింత బెటర్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది అని అయితే తెలిపారు. దీనితో ఈ మాటలు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.