ఈ ఏడాది టాలీవుడ్ సహా హిందీ మార్కెట్ లో కూడా భారీ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్”. ఎప్పుడో జనవరిలో బాలీవుడ్ లో హీరో షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” తర్వాత ఆ రేంజ్ లో హైప్ తో ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” అయితే జూన్ లో రిలీజ్ అయ్యింది.
మరి ఈ భారీ చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేక భారీ డిజాస్టర్ కాగా తెలుగులో అయితే నష్టాలే మిగిల్చినట్టుగా తెలిసింది. అయితే నిర్మాతలకి మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలే వచ్చినప్పటకీ థియేటర్స్ లో రన్ లేక సినిమా చతికిల పడింది.
ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఓంరౌత్ వర్క్ చేయగా రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే తొందరలో అయితే ఓటిటికి రాదు అని చెప్పారు కానీ సినిమా ప్లాప్ కావడంతో త్వరగానే వచ్చేయొచ్చు అని తెలిసింది. కాగా ఈ గ్యాప్ లో అయితే మళ్ళీ ఓటిటి అప్డేట్ ఏది లేదు కానీ లేటెస్ట్ గా అయితే మాత్రం షాకింగ్ గా ఈ చిత్రం ఓటిటి లో వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు భారీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఈ చిత్రం అయితే అందులో ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. కాగా ఒక్క హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో ఈ చిత్రం ఇప్పుడు ఇందులో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక హిందీ వెర్షన్ అయితే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు వచ్చింది. దీనితో అయితే ఇది సర్ప్రైజింగ్ అని చెప్పాలి. మరి అప్పుడు ఆగి ఇప్పుడు చూడాలి అనుకునేవారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.
Exciting update: #Adipurush has officially started streaming on @PrimeVideo, with options for viewing in multiple South Indian languages.
Dive into the epic now!#JaiSriRam #AdipurushOnPrime#Prabhas pic.twitter.com/Ul6lgopbU5
— Prabhas World (@Prabhas_Team) August 10, 2023