వైరల్ : “ఆదిపురుష్” వాయిదాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీత.!

గత కొంత కాలం నుంచి ఇండియన్ సినిమా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆదిపురుష్” కాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చాక ఎవరికీ మాట రాలేదు. ప్రభాస్ డైరెక్ట్ గా హిందీలో చేసిన సినిమా అందులోని రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సినిమా కావడంతో సినిమాపై చాలా హైప్ ఉండేది. 

కానీ టీజర్ చూసాక ఈ బొమ్మల సినిమా కోసమా ఇంతలా వెయిట్ చేయించారని ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా నటించగా తనకి సీత గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించింది.

అయితే ఆమె నటించిన తాజా చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియా దగ్గర ఆదిపురుష్ సినిమా వాయిదా పై అలాగే టీజర్ విజువల్స్ పై పలు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఆదిపురుష్ సినిమాని చేసినందుకు తమంత గర్వంగా ఫీల్ అవుతున్నామని రామాయణం లాంటి సబ్జెక్టు ని గ్లోబల్ గా రీచ్ అయ్యే విధంగా చాలా శక్తివంతంగా ప్లాన్ చేశామని ఆమె తెలిపింది.

అయితే టీజర్ కి అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాలేదు అందుకే ఇప్పుడు మళ్ళీ యూనిట్ అంతా సినిమాని బెటర్ గా మార్చేందుకు మళ్ళీ ప్రయత్నిస్తున్నారని డెఫినెట్ గా ఈ చిత్రంతో మంచి సక్సెస్ తాము అందుకుంటామని కృతి కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఈ సినిమాని అయితే ఓంరౌత్ దర్శకత్వం వహించగా తాను అలాగే భూషణ్ కుమార్ లు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.