ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి చాలా చోట్ల. కానీ, పూర్ రెస్పాన్స్ కనిపిస్తోందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల తిరుపతిలో నాలుగు కోట్లు ఖర్చు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పదేసి వేల చొప్పున టిక్కెట్లను ప్రముఖ నటులు కొనుగోలు చేసేలా మార్కెటింగ్ జిమ్మిక్కుని కూడా డిజైన్ చేశారు.
హనుమంతుడికి ప్రతి థియేటర్లోనూ ప్రతి షోకీ ఓ టిక్కెట్ కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలా ‘హైప్’ క్రియేట్ చేస్తున్నా, వ్యవహారం ఎక్కడో తేడా కొట్టేస్తోంది. ప్రభాస్ అభిమానులూ డల్ అయిపోయారు సోషల్ మీడియాలో.
ఎందుకీ పరిస్థితి.? ఆరు వందల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు ‘ఆదిపురుష్’ కోసం. వెయ్యి కోట్లు, ఆ పైన వసూళ్ళను అంచనా వేస్తున్నారాయె. అలాంటి సినిమాకి, ప్రీ రిలీజ్ బజ్ ఇంత డల్లుగానా.? బయ్యర్లలో భయాలు పెరిగిపోతున్నాయ్.!