అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో ఈ చిత్రాన్ని త్రీడీలో ఆవిష్కరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. లక్షమంది వరకు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఇక ఆదిపురుష్ టీం మొత్తం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరై సినిమాకి సంబందించిన విషయాలు పంచుకున్నారు.

ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ప్రభాస్ అమెరికా వెళ్తున్నాడు. అక్కడే వారం రోజుల పాటు ఉండి ఆదిపురుష్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నాడు. ఈ చిత్రాన్ని విదేశీయులకి కూడా చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ లెవల్ లో ఆదిపురుష్ సౌండ్ వినిపించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది.

అందుకు తగ్గట్లుగానే అమెరికాలో ఏకంగా వారం రోజులు మూవీ ప్రమోషన్స్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ వారం రోజులు కూడా సినిమాకి సంబందించిన మిగిలిన క్యాస్టింగ్ ఇంటర్వ్యూలు ఇండియాలో ఇచ్చే అవకాశం ఉంది. హిందీలో టి-సిరీస్, ఓం రౌత్ బ్రాండ్, తెలుగులో ప్రభాస్ బ్రాండ్ మూవీకి మెయిన్ ప్రమోషన్ గా మారిపోయింది.

అలాగే రామాయణం కథ కావడం కూడా ఆదిపురుష్ కి అదనపు బలం అని చెప్పాలి. ఇన్ని స్ట్రెంత్స్ ఉండటం వలన ఇండియా ఆదిపురుష్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ తక్కువగా ప్లాన్ చేశారు.ప్రభాస్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో కొన్ని ఇంటర్వ్యూలు, టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొని మూవీకి హైప్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట.

అంతకు మించి ఇండియాలో మూవీ ప్రమోషన్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ యూ సర్టిఫికేట్జారీ చేసింది. అలాగే నిమిషం తక్కువ రెండు గంటలు ఆదిపురుష్ మూవీ నిడివి ఉండబోతోంది. కృతి సనన్ సీతాదేవి పాత్రలో మూవీలో కనిపించబోతూ ఉంది. ఇక సైఫ్ ఆలీఖాన్ లంకేష్ రావణ్ గా నటించాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ ఆదిపురుష్ చిత్రంపై అంచనాలు అమాంతం పెంచేశాయి.