ఇప్పుడు ప్రభాస్ అంటే ఇండియన్ స్టార్. ఇండియన్ సినిమాలకు ప్రతినిధి అయ్యాడు. అందుకే ప్రభాస్‌తొ సినిమాలంటే ఆ స్థాయిలోనే ఉండాలి. భారతీయత ఉట్టిపడేలా చూపించాలి. ప్రభాస్ స్టార్డంకు తగ్గ కథలను తయారుచేయాలి. అందుకే ప్రభాస్ కూడా ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. సాహో ఓ మోస్తరుగా ఆడింది. ఆ తరువాతరాధేశ్యామ్‌ను తీసుకొస్తున్నాడు. అయితే ఇవి రెండూ కూడా బాహుబలి టైంలో విన్న కథలే. ప్రభాస్ ఇమేజ్ పెరిగాక ఆ కథల్లో కాస్త మార్పులు వచ్చాయి.
కానీ నాగ్ అశ్విన్ కథ ప్యాన్ వరల్డ్ అని చెప్పాడు. ఇక ఓం రావత్‌తో తీస్తోన్న ఆదిపురుష్ ప్రపంచంలో అందరికీ తెలిసిందే. రామ రావణ యుద్దాన్ని చూపించి.. చెడుపై మంచి ఎలా విజయం సాధిస్తుందో చూపించనున్నాడు. అందులో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ గురించి అప్డేట్లు ఇవ్వడంలో ఓ పద్దతిని ఫాలో అవుతున్నారు. ఉదయం ఏడు గంటల 11 నిమిషాలకు అప్డేట్లను ఇస్తుంటారు.
తాజాగా అలానే ఓ అప్డేట్ ఇచ్చారు. అయితే అందరూ కూడా సీత పాత్రను రివీల్ చేస్తారని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలువుతుంతొ మాత్రం చెప్పలేదు. ఈ చిత్రం 2022లో ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఆ డేట్ వెనుకు ఉన్న మర్మమేంటని ఆరా తీస్తున్నారు. ఈ సినిమాకు తాన్హాజీ ఫేం ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నాడు.