ఓటిటి : “ఆదిపురుష్” హక్కులు దిగ్గజ సంస్థ సొంతం.?

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ కలిగించే సినిమాల్లో ఒకటిగా ఉన్న లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇది కాగా ఈ భారీ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా..

ఈ సినిమా బిజినెస్ పై కూడా పలు షాకింగ్ లెవెల్లో జరిగింది అని సినిమాకి అయ్యిన బడ్జెట్ నే 500 కోట్లు అయితే అందులో సుమారు 90 శాతం కి పైగా జస్ట్ థియేట్రికల్ సహా నాన్ థియేట్రికల్ హక్కులతోనే వెనక్కి వచ్చేసింది అని టాక్ ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అయితే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి ఉంటుంది అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా వినిపిస్తుంది. కాగా ఈ భారీ సినిమా ఓటిటి హక్కులు అయితే దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రికార్డు మొత్తంలో అమౌంట్ ఇచ్చి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే సరైన నెంబర్ ఇంకా తెలియరాలేదు కానీ ఆదిపురుష్ ఓటిటి డీల్ మాత్రం ఈ భారీ సంస్థతో జరిగినట్టుగా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనితో థియేటర్స్ లో వచ్చాక ఈ సినిమా ప్రైమ్ వీడియో లో అయితే సందడి చేయనుంది అని చెప్పొచ్చు. కాగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్ తదితరులు నటించిన ఈ సినిమాని ఓంరౌత్ తెరకెక్కించగా ఈ ఏడాది జూన్ 16న ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.