“ఆదిపురుష్” మేకర్స్ గ్రాఫిక్స్ పై సిల్లీ రీజన్ చెబుతున్నారు.!

నో డౌట్ గా పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో భారీ క్రేజ్ ఉన్నటువంటి చిత్రాల్లో ఒకటిగా ఆదిపురుష్ కూడా ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గత రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ కన్నా కూడా ఈ సినిమాపై సౌత్ భాషల్లో కూడ మంచి హైప్ నెలకొనడం విశేషం.

ఆ రెండు సినిమాలకి తమిళ్, మలయాళం లలో అయితే చెప్పుకోదగ్గ రెస్పాన్స్ కూడా రాలేదు కానీ ఈసారి ఆదిపురుష్ టీజర్ కి అయితే సింగిల్ డే లో భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక తెలుగు హిందీలో అయితే చెప్పక్కర్లేదు.. ఇలా మాంచి అంచనాలు ఉన్న సినిమాని పూర్తిగా చిత్ర యూనిట్ అయితే దెబ్బ తీశారు.

చాలా దారుణమైన గ్రాఫిక్స్ తో చాలా పూర్ అవుట్ పుట్ ని అయితే చూపించి ఆడియెన్స్ కి షాకిచ్చారు. దీనితో ఒక్కసారిగా ట్రోల్స్ ఈ చిత్రంపై భయంకరంగా స్టార్ట్ అయ్యాయి. దీనితో వీటిని డిఫెండ్ చెయ్యడానికి వేరే దారి లేక అడ్డంగా కొన్ని సిల్లీ రీజన్ లు అయితే చెబుతున్నారు.

ఆదిపురుష్ టీజర్ మొబైల్ స్క్రీన్స్ లో చూడ్డానికి పనికిరాదని కేవలం బిగ్ స్క్రీన్ పైనే చూస్తేనే అందులో మ్యాజిక్ తెలుస్తుందని అంటున్నారు. అసలు ఇది ఏమన్నా సమంజసంగా ఉందా అని ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు.

ఇప్పటికీ సినిమా వాయిదా అంటూ కూడా కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. మరి ఫైనల్ గా ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించే లెవెల్లో ఉంటుందా లేక మరో ప్లాప్ గా నిలిచిపోతుందా అని ఫ్యాన్స్ భయంలో ఉన్నారు.