ఓటిటిలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్‌’

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ కాంబోలో వచ్చిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’ భారీ డిజాస్టర్‌ ను అందుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసినప్పటి నుంచి పూర్తి సినిమా రిలీజై ఫుల్‌ రన్‌ టైమ్‌ ఆడేంతవరకు ఎన్నో విమర్శలను అందుకుని భారీ ట్రోలింగ్‌ కు గురైంది. అలానే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్ర దర్శకుడు సినిమా గురించి తనను తాను ఎంత సమర్థించుకున్నా.. నెటిజన్లు, సినీ ప్రియులు ఆయన్ను ఓ ఆటాడేసుకున్నారు. సోషల్‌ విూడియాలో పుల్‌ ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో ఆయన చాలా రోజుల నుంచి సోషల్‌ విూడియాలోనూ సైలైంట్‌ అయిపోయారు.

అయితే తాజాగా ఈ భారీ చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా, హడావిడి చేయకుండా ఆగస్ట్‌ 11 అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్టీమ్రింగ్‌ కు వచ్చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షణ్‌ ప్రైమ్‌ లో అందుబాటులో ఉండగా.. హిందీ వెర్షన్‌ మాత్రం నెట్‌ ప్లిక్స్‌ కు స్టీమ్రింగ్‌ అవుతోంది. దాదాపు రూ.550కోట్ల బ్జడెట్‌ తో రూపొందిన గ్రాండియర్‌ మూవీ.. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా రావడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే ఇలా సైలెంట్‌ గా ఈ సినిమాను వదలటానికి.. సినిమా భారీ డిజాస్టర్‌, విమర్శలు, వివాదాలు కారణమనే చెప్పాలి.

ముఖ్యంగా ఔం రౌత్‌ అయితే.. సింపుల్‌ గా.. ప్రైమ్‌ లో ఆదిపురుష్‌ స్టీమ్రింగ్‌ అవుతోంది చూడండి అంటూ ఓ ట్వీట్‌ చేసి ఊరుకున్నారు. పైగా పోస్ట్‌ కింద కామెంట్స్‌ సెక్షన్‌ ను డిజేబుల్‌ చేశారు. కేవలం ట్రోలర్స్‌ దెబ్బకు భయపడే ఇలా చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఈ చిత్రంపై కోర్టులో ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. అవి చాలా వరకు పెండిరగ్‌ లోనే ఉన్నాయి. ఈ సమయంలో సినిమా రిలీజ్‌ కు స్టే వచ్చే ప్రమాదం కూడా ఉండటంతో.. మూవీటీమ్‌.. ఎటువంటి పబ్లిసిటీ చేయకుండా ఓటిటిలో రిలీజ్‌ చేసేశారని బాలీవుడ్‌ వర్గాల ఇన్‌ సైడ్‌ టాక్‌.