ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” కి రంగం సిద్ధం చేస్తున్నారు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాలు కూడా ఉండగా ఈ సినిమాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న భారీ సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి ఇది రామాయణం ఆధారంగా సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అని మేకర్స్ అంటున్నారు.

ఇదైతే అప్పుడు 500 కోట్లు అని చెప్పి రిలీజ్ చేసిన టీజర్ లో ఎక్కడా కనిపించలేదు దీనితో నెక్స్ట్ 100 కోట్లు పెట్టి మళ్ళీ వి ఎఫ్ ఎక్స్ పనులుస్ స్టార్ట్ చేయగా జూన్ లో రిలీజ్ కి ఫిక్స్ చేశారు. ఇక సినిమా రిలీజ్ కి మూడు నెలలు కూడా గ్యాప్ లేదు. దీనితో అసలు అభిమానులు ఇక అప్డేట్స్ అన్నీ ఎపుడు మొదలు అవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే అసలు ఈ అప్డేట్స్ కోసం చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ టాక్ తెలుస్తుంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ ని ఈ మార్చ్ 30 న శ్రీరామ నవమి కానుకగా అయితే ఓ బిగ్ అప్డేట్స్ తో స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇక్కడ నుంచి ఐతే ఆదిపురుష్ జాతర మొదలు కానుంది అని చెప్పాలి.

కాగా ఈ సినిమాలో అయితే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ అలాగే సన్నీ సింగ్ మరియు సోనాల్ చౌహన్ తదితరులు నటించగా ఈ జూన్ 16న అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ సహా అనేక సాధ్యమైనన్ని భాషల్లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.