ఓటిటి : “ఆదిపురుష్” డిజిటల్ రిలీజ్ అందులోనే.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర అవైటెడ్ రిలీజ్ గా వచ్చిన చిత్రం “ఆదిపురుష్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ అయితే ఈ సినిమాని నిర్మాణం వహించారు.

ఇక ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ కి రాగా ఈ మాసివ్ చిత్రం తాలూకా ఓటిటి హక్కులకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫో అయితే ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ అనంతరం అయితే దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐతే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఈరోజు థియేటర్స్ లో ప్రింట్ తో అయితే ఈ సినిమా డిజిటల్ పార్ట్నర్ గా అయితే ప్రైమ్ వీడియో ని వేయడంతో ఈ మ్యాటర్ కన్ఫర్మ్ అయ్యింది. సో థియేటర్స్ రన్ అనంతరం టైం చూసుకొని 8 వారాల తర్వాత మాత్రమే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐతే అందుబాటులోకి రానుంది.

ఇక ఈ భారీ సినిమాలో కృతి సనన్, సోనాల్ చౌహన్ అలాగే సైఫ్ అలీఖాన్ అలాగే సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా భూషణ్ కుమార్, ఓం రౌత్ లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు. కాగా ఈ చిత్రం ఈరోజు వరల్డ్ వైడ్ 3డి, 2డి వెర్షన్స్ లో అయితే విడుదల అయ్యింది.