“ఆదిపురుష్” డే 1కి ఈ వెర్షన్ వసూళ్లే ఎక్కువ.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా విజువల్ వండర్ చిత్రం “ఆదిపురుష్” కోసం చెప్పక్కర్లేదు. దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఈ జూన్ 16 గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇక మొదట్లో ఎన్నో రకాలుగా వరల్డ్ వైడ్ అయితే వీలైనంత గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ ఫైనల్ గా మాత్రం పాన్ ఇండియా భాషల్లో 3డి సహా 2డి వెర్షన్ లలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది. కాగా ఇప్పుడు రెండు వెర్షన్స్ లో కూడా ఆదిపురుష్ చిత్రం రికార్డు బుకింగ్స్ న ఇండియా వైడ్ నమోదు చేస్తున్నట్టుగా నేషనల్ మీడియా వారు కూడా కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా తెలుగు స్టేట్స్ సహా హిందీలో అయితే ఆదిపురుష్ష్ మొదటి రోజు బుకింగ్స్ భారీ మొత్తంలో 3డి వెర్షన్ కే ఎక్కువ దీంతో అయితే ఆదిపురుష్ 2డి వెర్షన్ కంటే 3డి వెర్షన్ వసూళ్లే బాగా కలిసొచ్చేలా ఉన్నాయని ట్రేడ్ చెప్తుంది.

ఒకవేళ డే 1 కానీ విజువల్స్ పరంగా సినిమా క్లిక్ అయితే మాత్రం రెండో రోజు నుంచి 3డి వెర్షన్ కి మరింత స్థాయి ఆదరణ పెరుగుతుంది అని చెప్పొచ్చు. దీనితో ఆదిపురుష్ వసూళ్లులో 3డి వెర్షన్ ప్రభావం ఒకింత ఎక్కువే ఉంటుంది. మరి చూడాలి ఏమవుతుందో అనేది. ఇంకా ఈ సినిమాలో జానకిగా కృతి సనన్ అలాగే రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు.