రిలీజ్ కి ముందే మరో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసిన “ఆదిపురుష్”.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొదటిసారి హిందీలో చేసిన తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కోసం తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్ అయితే ప్రభాస్ తో తప్ప మరో హీరోతో ఆదిపురుష్ చేయను అని స్టార్ట్ చేసిన ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు అయితే రేవు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లోనే మరో భారీ బిజినెస్ కలిగిన సినిమాగా రాబోతుండగా ఈ సినిమాపై ఉన్న హైప్ కి నిదర్శనం ఏ లెవెల్లో ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఈ చిత్రం అయితే ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

ఇది వరకు బుక్ మై షో లో అయితే 7 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ రిజిస్టర్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ ఏకంగా 10 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ ని రిజిస్టర్ చేసింది. దీనితో ఈ భారీ సినిమా ఖాతాలో రిలీజ్ కి ముందే భారీ రికార్డు సెట్ చేసింది. దీనితో అయితే ఆదిపురుష్ హైప్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

కాగా ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కించగా కృతి సనన్ జానకి దేవిగా సైఫ్ అలీఖాన్ రావణాసుర పాత్రలో నటించగా సన్నీ సింగ్ లక్షమణుని పాత్రలో నటించారు. అలాగే ఈ చిత్రం గ్రాండ్ విజువల్స్ తో అయితే రాబోతుంది.