ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ రిలీజ్ వస్తున్న ఏకైక సినిమా “ఆదిపురుష్”. మరికొన్ని గంటల్లో బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేయనున్న ఈ సినిమాకి అయితే ఇండియన్ సినిమా నుంచి పెద్దగా ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీస్ గా అయితే భారీ మొత్తంలో రాబోతుంది.
ఇక ఈ భారీ సినిమా అయితే ఇండియన్ సినిమా నుంచి ఏ ఇతర సినిమాలు పోటీ లేకుండా వస్తుంది అనుకుంటే హాలీవుడ్ నుంచి అయితే ఓ అవైటెడ్ విజువల్ డ్రామా “ది ఫ్లాష్” వరల్డ్ వైడ్ సహా ఇండియా లో కూడా ఏమన్నా ప్రభావం చూపించవచ్చు అని అయితే ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం పడ్డారు.
కానీ అనూహ్యంగా అయితే ఆదిపురుష్ చిత్రం ఇండియా లో ఈ హాలీవుడ్ సినిమాని తన దగ్గరకి కూడా రానివ్వలేదు. ఆడియెన్స్ అంతా కూడా 90 శాతం మంది ఆదిపురుష్ నే చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే దీనికి మరో కారణం “ది ఫ్లాష్” చిత్రం ఇండియన్ లో ఎక్కడ కూడా 3డి వెర్షన్ లో రిలీజ్ కాకపోవడమే అని చెప్పాలి.
దీనితో ఫ్లాష్ కి భారీ దెబ్బ పడగా ఇక మిగతా అందరి ఆసక్తి అయితే ఆదిపురుష్ వైపే టర్న్ అయ్యింది. దీనితో ఆదిపురుష్ చిత్రం ఇలా ఈ హాలీవుడ్ సినిమాని అయితే ఇండియాలో క్లియర్ గా డామినేట్ చేసి పారేసింది. అయితే ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ఆదిపురుష్ కి ది ఫ్లాష్ దెబ్బ పడొచ్చని చెప్పక తప్పదు. ఇండియా వరకు అయితే ఆదిపురుష్ సేఫ్.