అఫీషియల్ : భారీ రన్ టైం తో “ఆదిపురుష్” సెన్సార్ పూర్తి..!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో హిందీ సహా తెలుగు సినిమా దగ్గర కూడా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతదేశ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా అయితే తెరకెక్కింది.

అయితే రామాయణం ఏమీ చిన్నది కాదు దీనితో ఈ సినిమా రన్ టైం కూడా ఓ రేంజ్ లో వస్తుంది అని టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా అయితే బాలీవుడ్ సినిమా నుంచి అఫీషియల్ రన్ టైం అయితే వచ్చేసింది. ఈ చిత్రం ఏకంగా 2 గంటల 59 నిమిషాలు అన్ని టైటిల్స్ తో కలిపి వచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ చిత్రం క్లీన్ “యూ” సర్టిఫికెట్ తెచ్చుకోవడం మరో విశేషం. సినిమాలో భారీ ఏక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కానీ సెన్సార్ యూనిట్ అయితే ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

మొత్తానికి అయితే ఐతే ఈ చిత్రం భారీ రన్ టైం లో వస్తుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో జానకి గా కృతి సనన్, రావణుని పాత్రలో సైఫ్ అలీఖాన్ అలాగే లక్ష్మణునిగా సన్నీ సింగ్ అయితే నటించాడు. జూన్ 16న గ్రాండ్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.