అంగరంగ వైభవంగా ఆది,నిక్కీల రిసెప్ష‌న్‌.. ఫొటోస్ వైరల్..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఒకటే అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ ప్రేమ జంట అయిన ఆది పినిశెట్టి,నిక్కీ గ‌ర్లానీలు ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి చెన్నైలో ఘనంగా జరిగింది. అయితే ఆ పెళ్ళికి కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు బంధువులు సెలబ్రిటీలు మాత్రమే వచ్చారు. ఇకపోతే ఈ జంట 2015 లో వచ్చిన మలుపు సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

అప్పటినుంచి ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత వీరిద్దరూ దాదాపుగా రెండేళ్లపాటు వారి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈ క్రమంలోనే అందరికీ షాక్ ఇస్తూ మార్చి 24న ఎంగేజ్మెంట్ చేసుకునే ఒక్కటయ్యారు. అయితే టాలీవుడ్ హీరోలు నాని, సందీప్ లు కేవలం పెళ్లికి మాత్రమే కాకుండా హల్దీ, సంగీత్ వంటి ఫంక్షన్లకు కూడా హాజరయ్యారు. మే 18 పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట తాజాగా మళ్లీ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేశారు. అయితే ఆ రిసెప్షన్ ఏర్పాట్లను చూస్తుంటే స్వర్గంలో జరుపుకున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.

ఈ జంట అంగరంగ వైభవంగా వీరి రిసెప్షన్ వేడుకలు జరుపుకున్నారు. పెళ్లికి హాజరు కానటువంటి సెలబ్రిటీలు డైరెక్టర్లు దర్శకులు అందరూ కూడా వీరి రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. రాధిక‌, ఇళ‌య‌రాజాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు అభిమానులు అయితే రిసెప్షన్ లో భాగంగా చేసిన అలంకరణ ని చూసి నోరెళ్ళ బెడుతున్నారు.