మెలికలు తిరుగుతున్న అదా శర్మ.. ఒక్కసారిగా అలా చేయడంతో షాక్.. వైరల్ వీడియో

Adah sharma Shares Dance Video

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లంటే కుర్రకారకు ఎంతో స్పెషల్. పూరి హీరోయిన్లంటేనే ఓ ఫైర్ ఉంటుంది. ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. పూరి పరిచయం చేసిన హీరోయిన్లలో ఎక్కువగా కాలం పాటు స్టార్డంలో కొనసాగలేకపోయారు. అలా ఓ వెలుగు వెలిగి అంతర్దానమవుతుంటారు. కొందరు మాత్రం టాప్ హీరోయిన్లుగా దుమ్ములేపుతూనే ఉన్నారు.

Adah sharma Shares Dance Video
Adah sharma Shares Dance Video

హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు తెరకు అదా శర్మ అందాలను పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. అయితే అదా మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు. తెలుగులో చేసిన సినిమాలు హిట్ అయినా క్రెడిట్ మాత్రం దక్కలేదు. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి, కల్కి వంటి చిత్రాల్లో నటించినా అదాకు పేరు రాలేదు. అయితే అదా ఏ మాత్రం నిరాశ చెందలేదు. సోషల్ మీడియా ద్వారా తన పాపులార్టీని పెంచేసుకుంటోంది.

అదా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది.వెరైటీ స్టైల్స్, డిఫరెంట్స్ గెటప్, లుక్స్, డ్యాన్సులు, జిమ్నాస్టిక్స్, వంటలు ఇలా ఎన్నో రకాలు టాలెంట్లను ప్రదర్శిస్తుంటుంది. తాజాగా అదా డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె వయ్యారాలను ఊపిన తీరుకు, వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.