బ్రేకింగ్: నటి తమన్నాకు కరోనా.. హైఫీవర్ తో బాధపడుతున్న తమన్నా

actress tamannah tests corona positive

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. వదల బొమ్మాళి వదల అంటూ అందరిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. దీంతో చాలామంది జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ కరోనా మహమ్మారి వదలడం లేదు.

actress tamannah tests corona positive

టాలీవుడ్ లోనూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా.. టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు కరోనా సోకింది. తనకు హైఫీవర్ రావడంతో వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ గా తేలింది.

దీంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది తమన్నా. తనకు హైఫీవర్ రావడంతో.. మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యుల.. ఇన్ఫెక్షన్ లేవల్స్ ను చెక్ చేస్తున్నారు.

ఓ షూటింగ్ నిమిత్తం తమన్నా హైదరాబాద్ కు వచ్చింది. ఇంతలోనే తనకు కరోనా సోకడంతో తన షూటింగ్ లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. తమన్నా ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

దానితో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. నవంబర్ 1 నుంచి తమన్నా సీటీమార్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

ఇటీవలే తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. అప్పుడు తమన్నా కూడా కోవిడ్ టెస్టులు చేయించుకున్నా.. తనకు నెగెటివ్ వచ్చింది. అయితే.. తమన్నా తల్లిదండ్రులు ప్రస్తుతం కరోనా బారి నుంచి తప్పించుకున్నారు. వాళ్లు ప్రస్తుతం కోలుకున్నారు.