భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ.. కారణం ఇదేనా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్య తర్వాత అలాంటి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి స్నేహ ఒకరు. ఈమె కట్టు బొట్టు అచ్చం సౌందర్యను తలపించాయని చెప్పాలి. ఈ విధంగా చేసినది తక్కువ సినిమాలలో అయినా ఎంతో అద్భుతమైన పాత్రలలో ఎలాంటి గ్లామర్ షోకే తావు లేకుండా ఉన్నటువంటి స్నేహ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ విధంగా ఈమెకు హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో వదిన అక్క పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు.ఇక స్నేహ తమిళ నటుడు ప్రసన్న కుమార్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత మెల్లిగా సినిమాలకు దూరమైనప్పటికీ తన భర్తతో కలిసి పలు యాడ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా నటి స్నేహ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెరలు కొడుతుంది స్నేహ తన భర్తకు దూరంగా ఉంటున్నారని వార్త వైరల్ కావడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా నటి స్నేహ తన భర్తకు దూరంగా తన పిల్లలతో కలిసి ఉన్నారనే వార్త వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా అందుకే దూరంగా ఉన్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈమధ్య కాలంలో సెలెబ్రెటీలు చిన్నపాటి మనస్పర్థల కారణంగానే విడాకుల వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నటి స్నేహ సైతం భర్తకు దూరంగా ఉన్నారని తెలియడంతో ఈమె కూడా విడాకులకు సిద్ధమైందా అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై నటి స్నేహ స్పందించాల్సి ఉంది.